బ్రహ్మం గారు చెప్పిందే జ‌రిగింది – తిరుమ‌ల‌లో కాశీలో

బ్రహ్మం గారు చెప్పిందే జ‌రిగింది - తిరుమ‌ల‌లో కాశీలో

0
150

బ్రహ్మం గారు తన కాల జ్ఞానంలో చెప్పిన‌వి చాలా వ‌ర‌కూ జ‌రిగాయి, అయితే నేడు క‌రోనా వైర‌స్ వ్యాప్తితో మ‌రిన్ని క‌ళ్ల ముందు జ‌రుగుతున్నాయి అంటున్నారు చాలా మంది , నిజ‌మే ఎందుకు అంటే ఆయ‌న చెప్పిన మాట తిరుమ‌లలో వెంక‌న్న ఆల‌యం మూత‌బ‌డుతుంది అని అన్నారు కాశీ ప‌ట్ట‌ణంల ఆ శివ‌య్య ఆల‌యం పాడుబ‌డుతుంది అని అన్నారు.

ఇవ‌న్నీ త‌నకాల‌ జ్ఞానంలో చెప్పిన మాటలు అన్నీ నిజ‌మ‌య్యాయి…1910-12 మధ్య గంగానదికి తీవ్రమైన వరదలు వచ్చి, కలరా వ్యాపించగా, నెలన్నర పాటు భక్తులు విశ్వనాథుని దర్శనానికి వెళ్లలేదు. అలా కాశీ ఆల‌యంలో ద‌ర్శ‌నం లేదు అది పాత‌బ‌డింది..

ఇక ఇప్పుడు క‌రోనా వ‌ల్ల తిరుమ‌ల ఆల‌యంలో కూడా స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది, అయితే ఇలా చేయ‌డం తిరుమ‌ల‌లో రెండోసారి
1892లో స్వామివారి ఆలయాన్ని ఓసారి మూసి వేశారు. అందుకు కారణాలు ఏంటన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు. కాని అక్క‌డ రికార్డుల్లో ఇది రాసి ఉంది అంటున్నారు, ఇప్పుడు మ‌ళ్లీ తిరుమ‌ల‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.