నేటి యువత సిగరెట్లకు బానిసలు కావడం మెయిన్ రీజన్ అదోక్కటే

నేటి యువత సిగరెట్లకు బానిసలు కావడం మెయిన్ రీజన్ అదోక్కటే

0
106

ఇప్పుడు సిగరెట్ తాగడం ప్రతీ ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది… చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా ప్రతీ ఒక్కరు సిగరెట్ తాగుతూ తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు… కాలేజీ విద్యార్థులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు… క్లాసులకు డుమ్కీ కొట్టి మరీ సిగరెట్ తాగేందుకు టీస్టాల్ లకు వెళ్తున్నారు…

ఇక దీనికి తోడు టీస్టాల్ లో ఉచిత వైఫైవ్ అందిస్తుండడంతో అక్కడే కూర్చుని ఆన్ లైన్ గేములు ఆడుతున్నారు… మైనర్ లకు ధూమపానం నిషేదం అని చెప్పినా కూడా టీ స్టాల్ యాజమాన్యం కుర్చీలు వేసి మరీ వారిని ప్రోత్సహిస్తోంది… దీంతో టీస్టాల్ వద్ద పొగరాయుళ్లు ఎప్పుడు పడితే అప్పుడు నిర్భయంగా ధూమపానం చేస్తున్నారు..

ధూమపానం నియంత్రణ లేకపోవడంతో టీస్టాల్ యాజమాన్యం, పొగరాయుళ్లు రెచ్చిపోతున్నారు… బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేదం అనే చట్టం వచ్చినా కూడా టీస్టాల్ యాజమాన్యం లెక్క చేయకుంది…

ఇక ఆటో బైక్ లలో తిరిగే వారు ఇష్టాను సారంగా సిగరెట్లు తాగుతున్నారు… బైక్ కార్లు నడిపేవారు ఒక చేతిలో హ్యాండిల్ , మరో చేతిలో సిగరెట్ పెట్టుకుని నడుపుతూంటారు కొంతమంది… అలాచేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు…