ఆ జాబితాలో చేర‌నున్న జ‌గ‌ప‌తిబాబు

ఆ జాబితాలో చేర‌నున్న జ‌గ‌ప‌తిబాబు

0
92
Jagapathi babu

ఫ్యామిలీ హీరోగా జ‌గ‌ప‌తిబాబుకి ఎంతో పేరు ఉంది… కుటుంబ క‌థా చిత్రాల‌లో వెంక‌టేష్ జ‌గ‌ప‌తిబాబు చేసిన చిత్రాలు టాలీవుడ్ లో మ‌రే హీరో చేయ‌లేదు అనే చెప్పాలి, అయితే జ‌గ‌ప‌తిబాబు కూడా అద్బుత‌మైన న‌ట‌న చేస్తారు, ఇక ఇప్పుడు ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ల‌తో నాటి హీరోయిజం కంటే నేడు మ‌రింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఫేమ్ తో పాటు ఆస్తి కూడా ఇప్పుడే సంపాదించుకుంటున్నారు. ఇక విల‌న్ గా అన్నీ భాష‌ల్లో చిత్రాలు చేస్తూ అద‌ర‌గొడుతున్నారు ఆయ‌న‌. ఇక తాజాగా ఆయ‌న బుల్లితెర‌పై కూడా క‌నిపించ‌నున్నార‌ట‌ బుల్లితెర మీద నిర్వహించే ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా మారబోతున్నారట.

ఆయ‌న‌తో ఉన్న హీరోలు నాగార్జున చిరంజీవి ఇప్ప‌టికే ప‌లు షోలు హోస్ట్ చేశారు, తాజాగా ఎన్టీఆర్ నాని రోజా ఇలా ప‌లువురు హీరోలు హీరోయిన్లు చేస్తున్నారు, ఇప్పుడు ఈ జాబితాలో జ‌గ‌ప‌తిబాబు చేరుతున్నారు
జెమినీ టీవీలో ఓ గేమ్ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఆయ‌న అంగీకరించినట్లు తెలుస్తుంది. వ‌చ్చే నెల‌లో ఇది టెలికాస్ట్ అవ్వ‌నుంద‌ట‌.