మొత్తానికి నిర్భయకు న్యాయం జరిగింది.. ఈ దారుణం జరిగిన ఏడు సంవత్సరాల తర్వాత ఆనలుగురు దుర్మార్గులకి ఉరిశిక్ష అమలు చేశారు, అయితే ఈ విషయంలో దేశం అంతా సంతోషించింది, ఇలాంటి వారికి లేటుగా శిక్ష పడటం పై విమర్శలు చేశారు, మొత్తానికి తీహార్ జైల్లో వాళ్ల నలుగురిని ఉరితీశారు.
తీహార్ జైలుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మురికివాడ రవిదాస్ కాలనీ మాత్రం విషాదంలో మునిగిపోయింది. ఎందుకు అంటే ఈ కేసులో ఆరుగురు దోషులు ఇక్కడ ఉండేవారే,
ఇందులో ముఖ్య నిందితుడు బస్సు డ్రైవర్ రాంసింగ్ 2013లో జైలు గదిలో ఉరివేసుకుని చనిపోయాడు.
ఇక ముఖేష్ సింగ్ తల్లి ఇక్కడ నుంచి రాజస్ధాన్ వెళ్లిపోయింది, వినయ్‌శర్మ, పవన్ గుప్తా కుటుంబాలు కూడా ఇక్కడే ఉండేవి. ఇక వీరికి నలుగురికి ఉరిశిక్ష పడటంతో ఉదయం నుంచి ఆ ప్రాంతంలో జనం వారి ఇంటి దగ్గరే ఉన్నారు, వారి తల్లులు ఎంతో బాధపడ్డారు..జైలులో ఉన్నా బతికి ఉన్నారని అనుకునేవారమని, ఇప్పుడు కళ్లముందే కానరాని లోకాలకు వెళ్లిపోయారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా ఆ ప్రాంతంలో వారి ఇంటి ముందు వందలాది మంది వెళ్లి వారిని ఓదార్చారు.