దేశం అంతా ఎదురుచూసిన ఘట్టం పూర్తి అయింది.. నిర్భయ దోషులకు ఉరి పడింది. తీహార్ జైల్లో నలుగురు దోషులు ఉరి తాళ్లకు వేలాడారు. చివరకు ఏడేళ్ల తర్వాత వీరి నలుగురికి ఉరి శిక్ష అమలు అయింది, ఈ కేసులో ఎంతో కష్టపడి వారికి ఉరి పడాలి అని కోర్టు మెట్లు ఎక్కిన నిర్భయ తల్లి ఆశాదేవి ఆశలు ఫలించాయి.
మొత్తానికి ఆమె కూడా ఆనందించింది.ఈ నలుగురికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించి వారి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అయితే దాదాపు ఏడేళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వీరిలో ముగ్గురు అక్కడ పనులు చేసి కాస్తో కూస్తో డబ్బును సంపాదించారు.
కాని వీరిలో ముఖేష్ కుమార్ మాత్రం ఏపని చేయను అని అలాగే ఉన్నాడు, అక్షయ్ ఠాకూర్ రూ.69వేలు, పవన్ గుప్త రూ.29వేలు, వినయ్ శర్మ రూ.39వేలు జైల్లో సంపాదించారు. ఈ డబ్బును జైలు అధికారులు వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఇందులో వీరు పదో తరగతి డిగ్రీ చదవాలి అని అప్లై చేశారు కాని వీరు మాత్రం అది రాయలేదు, పాస్ కాలేదు.