కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పెద్ద ఎత్తున స్కూల్లు కాలేజీలు దేశ వ్యాప్తంగా మూసివేస్తున్నారు.. ఈనెల 31 వరకూ ఎవరికైనా అత్య అవసరం ఉంటేనే బయటకు రావాలి అని చెబుతున్నారు.. రేపు జనతా కర్ఫూ కూడా నిర్వహించనుంది దేశం, అయితే దీనిని అందరూ పాటించాలి అని చెప్పారు.
ఇక రైళ్లు బస్సులు ఆటోలు ఇలా ట్రాన్స్ పోర్ట్ కూడా ఉండే అవకాశం లేదు అంటున్నారు.ఈ సమయంలో మన దేశంలో పలు అంతర్జాతీయ స్టోర్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాదులోని తమ స్టోర్ ను ఈరోజు నుంచి మూసివేస్తున్నట్టు ఇంటర్నేషనల్ ఫర్నిచన్ జెయింట్ ఐకియా ఓ ప్రకటనలో తెలిపింది.
అంతేకాదు హైదరాబాద్ లో ఇంటర్ నేషనల్ స్టోర్స్ నైకీ, అడిడాస్, యాపిల్ వంటి అంతర్జాతీయ స్టోర్లు కూడా మూతపడ్డాయి. ఇక హైదరాబాద్ నగరం కూడా పూర్తిగా శుభ్రం చేస్తున్నారు… అంతేకాదు పోలీసులు వైద్య అధికారులు మున్సిపల్ అధికారులు ఈ వైరస్ విషయంలో ప్రజలకు జాగ్రత్తలు కూడా చెబుతున్నారు.