మరో మహిళకు కరోనా నెంబర్ మరింత పైపైకి

మరో మహిళకు కరోనా నెంబర్ మరింత పైపైకి

0
90

కరోనా సోకిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది, దీంతో వీటిని ఎలా నిలువరించాలి అనే సమస్య కూడా వస్తోంది…. దాదాపు తెలంగాణలో ఇప్పటి వరకూ ఇరవై ఆరు కేసులు ఉంటే 26.. ఇప్పుడు మరో పాజిటీవ్ కేసు వచ్చింది. దీంతో 27 కరోనా పాజిటీవ్ కేసులు తెలంగాణలో నమోదు అయ్యాయి.

దుబాయ్ నుంచి వచ్చిన హైదరాబాద్ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ రోజు మొత్తం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు, రాజోలు, కొత్తగూడెం, హైదరాబాద్, కూకట్పల్లి, మణికొండకు చెందిన వారికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

అయితే ఈనెల 31 వరకూ టోటల్ తెలంగాణ బంద్ కావడంతో, ఇక ఎవరూ బయటకు రావడానికి లేదు, ఇక జనతా కర్ఫ్యూ ఎలా పాటించారో అలాగే పాటించాలి అని కేసీఆర్ తెలిపారు. మరిన్ని కేసులు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి అని సూచించారు.