అతి ఖరీదైన వ్యాపారం ప్రారంభిస్తున్న బన్నీ

అతి ఖరీదైన వ్యాపారం ప్రారంభిస్తున్న బన్నీ

0
103

ఇప్పుడు చాలా మంది సినిమా హీరోలు సినిమాల్లో నటిస్తూనే నిర్మాతలుగా మారుతున్నారు.. వారు పలు సినిమాలు నిర్మిస్తూ ఏకంగా ఇప్పుడు కొత్త సినిమాలకు నిర్మాతలుగా మారుతున్నారు, ఇక వారి సినిమాల్లో భాగస్వాములు అవుతున్నారు, అంతేకాదు పలువురు హీరోలు షాపింగ్ మాల్స్ తో పాటు సినిమా ధియేటర్స్ బిజినెస్ లోకి వస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది హీరోలు ఈ దారిలో ఉన్నారు, ఇక మహేష్ బాబు కూడా హైదరాబాద్ లో ఏషియన్ తో కలిసి ఓ మాల్ నిర్మించారు…మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ దారిలో అల్లు అర్జున్ కూడా చేరారు.

హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఉన్న సత్యం ధియేటర్ ప్రాంగణంలో చేపడుతున్న మల్టీప్లెక్స్ లో బన్నీకి పార్ట్ నర్ షిప్ ఉందని తెలుస్తోంది. ఈ వెంచర్ ను మరో డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థతో కలిసి బన్నీ నిర్మిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

లగ్జరీ కార్లు అద్దెకు ఇచ్చే బిజినెస్ లో బన్నీ పెట్టుబడి పెట్టబోతున్నాడని టాక్ వినిపిస్తోంది…. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు, ప్రముఖల రాక సందర్భంగా ఖరీదైన లగ్జరీ కార్లను ఏర్పాటు చేయడమే ఈ బిజినెస్ టాస్క్. మొత్తానికి బన్నీ ఈ బిజినెస్ లోకి రావాలి అని చూస్తున్నారట.