మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రం ఆచార్య గురించి… రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది…. అయితే అందరి దృష్టి అత్యధికంగా ఆకర్షించే వార్త ఏంటంటే ఈ చిత్రంలో కీలక పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నడనే టాక్ వినిపిస్తోంది…. మహేష్ బాబు 30 రోజుల పాటు ఆచార్య చిత్రం కోసం షూటింగ్ లో పాల్గొన బోతున్నాడని టాక్..
దీంతో అంచనాలు పీక్స్ కు తీసుకువెళ్తున్నాయి… అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్యలో మహేష్ బాబు లేడనే టాక్…. అనుకున్నట్లుగానే లాభమో నష్టమో రామ్ చరణ్ తోనే చేయించాలని నిర్ణయించుకున్నారట… మహేష్ బాబు 30 రోజులకు ఏకంగా 30 కోట్లు పారితోషకం డిమాండ్ చేశాడట…
30 కోట్ల పారితోషకం ఆయనకు ఇస్తే… సినిమా బడ్జెట్ శృతిమించే ఆలోచనతో మహేష్ కు దూరం అయినట్లు టాక్ వినిపిస్తోంది మెగాస్టార్ తో చరణ్ నటించినా కూడా సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారని టాక్…