బాల‌య్య కుమారుడితో అనిల్ రావిపూడి సినిమా

బాల‌య్య కుమారుడితో అనిల్ రావిపూడి సినిమా

0
87

టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ సినిమాల‌తో దూసుకుపోతున్న ద‌ర్శ‌కుడు ఎవ‌రు అంటే వెంట‌నే చెప్పేది ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ..తాజాగా వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం మంచి ఫేమ్ తెచ్చింది, ఇక ఎఫ్ 3 కూడా తీసే ఆలోచ‌న‌లో ఉన్నారు ఆయ‌న.. ఆ సినిమా క‌థ రాసే ప‌నిలో ఉన్నారు, ఆయ‌న టీమ్ అంతా ఇదే వ‌ర్క్ లో ఉంది అని తెలుస్తోంది.

ఇక తాజాగా ఒక షోకి సంబంధించిన వేదికపై ఆయన మాట్లాడుతూ ..నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో నా గదిలోని గోడకి, మోక్షజ్ఞతో కలిసి బాలకృష్ణ దిగిన ఫొటో ఉండేది. ఆ ఫొటో చూసినప్పుడల్లా మోక్షజ్ఞ హీరోగా తప్పకుండా ఒక సినిమా చేయాలనిపించేది. కుదిరితే బాలకృష్ణగారితోను సినిమా చేయాలనుండేది అని తెలిపారు ఆయ‌న‌.

వారిద్ద‌రితో క‌లిసి నేను సినిమా చేస్తాను అని నా స్నేహితుల‌తో చాలా సార్లు చెప్పారు, ఇది క‌చ్చితంగా చేస్తాను అని అన్నారు అనిల్ రావిపూడి, మొత్తానికి బాల‌య్య ఇప్పుడు త‌న‌యుడ్ని సినిమాల్లోకి తీసుకురావాలి అని చూస్తున్నారు.. ఈ స‌మ‌యంలో అనిల్ ఈ కామెంట్ చేయ‌డంతో అవ‌కాశం ముందు అనిల్ కు ఇచ్చినా బాగుంటుంది అంటున్నారు బాల‌య్య అభిమానులు, చూడాలి ఎలా ఈ చిత్రం తీస్తారో.