ఉగాది రోజు తెలంగాణ‌లో నో క‌రోనా కేస్- కార‌ణం ఇదే

ఉగాది రోజు తెలంగాణ‌లో నో క‌రోనా కేస్- కార‌ణం ఇదే

0
122

కొత్త సంవ‌త్స‌రం ఉగాది సంద‌డి లేదు.. తెలంగాణ‌లో కోవిడ్ వ్యాధి నేప‌థ్యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు ప్ర‌జ‌లు.. ఎక్క‌డా హ‌డావుడి లేకుండా ఇంట్లోనే పూజ‌లు చేసుకున్నారు, కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు ఎక్క‌డా జ‌ర‌ప‌లేదు.. లైవ్ లో మాత్ర‌మే పంచాగ శ్ర‌వ‌ణం విన్నారు అంద‌రూ.

దేశవ్యాప్తంగా 606 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది…. అలాగే, 10 మంది మృతి చెందినట్టు తెలిపింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 43 మంది కోలుకున్నట్టు వివరించింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో మ‌రో రెండు కొత్త కేసులు న‌మోదు అయ్యాయి, అయితే తెలంగాణ‌లో మాత్రం ఈ రోజు ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు, ఇది చాలా సంతోష‌క‌ర‌మైన వార్త అనేచెప్పాలి, ఎక్క‌డిక‌క్క‌డ అన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. జాగ్ర‌త్త‌లు కేసీఆర్ చెప్ప‌డం, అలాగే జ‌నాలు పాటించ‌డం వ‌ల్ల ఈ రికార్డు అంటున్నారు జ‌నం… ఇలా ఉంటే క‌చ్చితంగా ఏప్రిల్ 14 వ‌ర‌కూ ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు అంటున్నారు.