దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా పై పెద్ద యుద్దమే జరుగుతోంది, ఎవరూ రోడ్లపైకి రాకూడదు అని చెబుతున్నారు పోలీసులు, ఎక్కడికక్కడ పోలీసులు బారీ కేడ్లు ఏర్పాటుచేసి ప్రజలని రోడ్లపైకి రానివ్వడం లేదు, కరోనా కేసులు మరింత పెరుగుతున్న సమయంలో రోడ్లపైకి జనం వస్తే అది మరింత తీవ్రతరం అవుతుంది అని చెబుతున్నారు.
అయితే ఏపీ నుంచి సీఎం జగన్ కూడా వెయ్యి రూపాయల నగదు రేషన్ సరుకులు ఉచితంగా అందిస్తాము అని తెలిపారు. ఇక ఈ సమయంలో చాలా మంది కరోనా బాధితుల కోసం విరాళాలు సీఎం సహయనిధికి అందిస్తున్నారు ఏపీ తెలంగాణలో తమిళనాడులో ఇది జరుగుతోంది.
తాజాగా ఎంపీ నిధుల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 4 కోట్లు కేటాయిస్తున్నట్టు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రకటించారు. దీనిపై సీఎం జగన్ కు ఆయన లేఖరాశారు, మిగిలిన ఎంపీలు కూడా ఇదే చేయాలి అని అన్నారు, కరోనాని అరికట్టేందుకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి అని అన్నారు.