కరోనా విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే సంఘటన ఇది..కేరళలో ఈ కేసులు మరింత పెరుగుతున్నాయి.. ఇప్పుడు ఏకంగా 112 కేసులు నమోదు అయ్యాయి, కేరళలో ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి ఇండియా వచ్చాడు, ఈ సమయంలో అతనికి పాజిటీవ్ అని తేలింది, అయితే మార్చి 16న అతనికి పాజిటీవ్ అని తేలింది.
అయితే అతను హోం ఐసోలేషన్‌ను పాటించే 20 నిమిషాల ముందు తన బిడ్డ, భార్య, తల్లితో మాట్లాడినట్లు తెలిపాడు. తర్వాత వారికి దూరంగా ఉంటూ హోం ఐసోలేషన్‌ను పాటించాడు. కాని ఇప్పుడు ఆ ఇరవై నిమిషాలు మాట్లాడిన ప్రతిఫలం ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులకి కరోనా వచ్చేసింది.
ఆ కుటుంబ సభ్యులకి టెస్ట్ చేస్తే వారికి కూడా కరోనా పాజిటీవ్ గా తేలింది. మార్చి 20న అతని కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య పరీక్షల్లో స్పష్టమైంది, ఇక అతన్ని ఎయిర్ పోర్ట్ నుంచి కారులో అతని ఫ్రెండ్ తీసుకువచ్చాడు, అతనికి నేడు టెస్ట్ చేస్తే అతనికి కోరానా పాజిటీవ్ వచ్చింది, చూశారుగా ఎంత అప్రమత్తంగా ఉండాలో.