ఏపీలో తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రజలు, పోలీసులు కూడా రోడ్లపైకి జనాలని రాకుండా అడ్డుకుంటున్నారు.. ఎంత అవసరం ఉన్నా ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే రావాలి అని చెబుతున్నారు.
ఓ పక్క ఏపీలో తెలంగాణలో కూడా నిత్యం రోడ్లపైకి జనాలు వస్తే వారికి పోలీసులు నచ్చచెబుతున్నారు. వెనక్కి వెళ్లిపోవాలి అంటున్నారు… యువత వస్తే బైకులు సీజ్ చేస్తున్నారు, అయితే పనిలేని వారిని ఆదుకుంటాము అన్నారు, తాజాగా ఏపీలో 1000 తెలంగాణలో 1500 రూపాయలు సీఎంలు ప్రకటించారు, రేషన్ ఇంటికి అందిస్తాము అన్నారు.
ఈ సమయంలో సీఎం సహయనిధికి విరాళాలు కూడా భారీగానే వస్తున్నాయి. ఇటీవలే నితిన్ రెండు తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల చొప్పున ఇచ్చారు. తాజాగా పవన్ కల్యాణ్ ఏపీకి 50 లక్షలు తెలంగాణకు 50 లక్షలు ముఖ్యమంత్రుల సహాయ నిధికి డొనేట్ చేస్తున్నానని తెలిపారు.. కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ డబ్బులను వెచ్చించాలని పవన్ కోరారు.