ఉగాది రోజున పంచాగ శ్రవణం జరిగింది, అయితే దీనిని లైవ్ టెలికాస్ట్ చేయడంతో ఇళ్ల నుంచే అందరూ ఈ పంచాగం గురించి కొత్త సంవత్సరం గురించి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉగాది వేడుకలు హైదరాబాదులోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో నిరాడంబరంగా సాగాయి, సంతోష్ కుమార్ పంచాంగ పఠనం చేశారు.
శార్వరీ నామ సంవత్సరం వచ్చింది, అయితే ఈ సంవత్సరంలో ఆరుసార్లు కాల సర్పయోగం కలుగుతుంది అని తెలిపారు, దీని వల్ల ప్రపంచానికి విపత్తులు వస్తాయి అని ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు.
మే 22 వరకూ ప్రజలు జాగ్రత్తగా ఉండక తప్పదని అప్పటి వరకూ కరోనా ప్రభావం ఉంటుంది అని తెలిపారు. చండీయాగాలు, హోమాలు, వేద పారాయణాలు చేయడం ద్వారా వైరస్ బారి నుంచి బయటపడటానికి అవకాశాలు పెరుగుతాయని సూచించారు,. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు.