బాలీవుడ్ గాయని కనికా కపూర్ ఆమెకి కరోనా పాజిటీవ్ రావడంతో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు, అసలు ఆమె పేరు మార్గోగిపోయింది. ఇటీవల లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఆమెకి చికిత్స అందిస్తున్నారు, మూడు సార్లు టెస్టులు చేశారు మూడు సార్లు ఆమెకి పాజిటీవ్ అని వచ్చింది.
మరోవైపు, ఆమె పార్టీలలో పాల్గొనడంతో…ఆమెతో పాటు గడిపిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం భయంతో వణికిపోతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా కొద్ది రోజులుగా క్వారంటైన్ లో ఉన్నారు.
ఇక తాజాగా బ్రిటిష్ యువరాజు చార్లెస్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. లండన్ లో ప్రిన్స్ చార్లెస్ తో కనికా కపూర్ గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కనికా వల్లే ఆయనకు వైరస్ సోకింది అంటున్నారు, దీంతో పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఫోటోలు ఇప్పటివి కావు అని అది 2015లో ఓ ఈవెంట్ సందర్భంగా తీసినవని ఓ న్యూస్ పోర్టల్ వివరించింది. మొత్తానికి ఈ విషయంలో ఆమెని నిందించడం ఎందుకు అని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.