ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా టెన్షన్ కనిపిస్తోంది అయితే వైద్యులు పోలీసులు ఎంతో కష్టపడుతున్నారు, ఎవరిని రోడ్లపైకి రానివ్వడం లేదు, అంతేకాదు పెద్ద సంఖ్యలో పికెట్స్ ఏర్పాటు చేశారు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇలా వైరస్ లు వ్యాప్తి చెందితే ఎక్కడైనా సరే చాలా కష్టమే. ఏ దేశంలో చూసినా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది.
ముఖ్యంగా అభివృద్ది చెందిన దేశాల్లో ఈ సమస్య మరింత కరిపిస్తోంది …స్పెయిన్ అమెరికా ఇటలీ ఇరాన్ రష్యాలో చైనాలో ఈ వ్యాధి మరింత ముదురుతోంది, మన దేశంలో వెంటనే మేల్కొనడంతో ఈ సమస్య కాస్త తక్కువే ఉంది అని చెప్పాలి.
అయితే ఇటలీలో ప్రభుత్వం ముందు హెచ్చరించింది … కాని అక్కడ ప్రజలు పట్టించుకోలేదు.. ఆ దేశానికి ఎవరు వచ్చినా ఎవరిని చెక్ చేయలేదు ..పర్యాటకం కూడా ఆపలేదు.. ఇలా అనేక తప్పులు ఆ దేశాన్ని ముంచేశాయి.. దేశంలో ప్రజలను కూడా పార్టీలకు వద్దు అన్నారు.. బయటకు వెళ్లవద్దు అన్నారు. కాని వారు అవేమి పట్టించుకోలేదు.. ఇప్పుడు ఇలాంటి దారుణమైన స్దితి వచ్చింది, అందుకే బయటకు రాకండి ఇటలీలా ఎవరూ ఇబ్బంది పడకండి అని చెబుతున్నారు అన్నీ దేశాల్లో .