ఖాతాదారుల‌కి బ్యాంకులు గుడ్ న్యూస్ త‌ప్ప‌క తెలుసుకోండి

ఖాతాదారుల‌కి బ్యాంకులు గుడ్ న్యూస్ త‌ప్ప‌క తెలుసుకోండి

0
113

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో బ్యాంకులు కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్నాయి… ఈ స‌మయంలో చాలా మంది ప‌నులు వ్యాపారాలు ఉద్యోగాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నారు.. వారు తిరిగి రీపేమెంట్ చేయ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నారు.. అయితే ఖాతాదారుల కోసం ప‌లు బ్యాంకులు కొత్త‌గా ఆఫ‌ర్ ఇస్తున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలు లో ఉంటుంది అని అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అందుకే బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌కు మంచి అవ‌కాశం ఇస్తున్నాయి.

కొంద‌రు ఖాతాదారుల‌కి ప్రత్యేక అత్యవసర రుణాలను అందించడానికి సన్నధం అయ్యాయి బ్యాంకులు.. ఈ జాబితాలో ఇండియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి.
ఇవి బుధ‌వారం నుంచి ప్రారంభించారు, నేరుగా బ్యాంకుకి వెళ్లి తీసుకోవ‌చ్చు లేదా ఆఫ్ లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పొంద‌వ‌చ్చు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొవిడ్ ఎమర్జెన్సీ లైన్ ఆఫ్ క్రెడిట్ ని ప్రారంభించింది.