తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో నిఖిల్ నటిస్తున్నచిత్రం 18 పేజెస్… ఈ చిత్రంలో తొలుత నిఖిల్ కు సరసన క్రితి శెట్టి అనుకున్నారు కానీ ఫిలిం మేకర్స్ మాత్రం అను ఇమ్మాన్యుయేల్ కు మొగ్గు చూపారట…
అందుకే ఆమెతో చర్చలు జరుపుతున్నారు… కాగా నాచురల్ స్టార్ నాని హీరో గా తెరకెక్కిన చిత్రం మజ్ను ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అను… ఆ తర్వాత నాపేరు శివ నా ఇల్లు ఇండియా దాని తర్వాత శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో హీరోయిన్ గా నటించింది…
ఈ రెండు సినిమాలు ఈ అమ్మడుకు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు… దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు తక్కువ అయ్యాయి…. తాజాగా నిఖిల్ తో నటించే అవకాశం వచ్చినట్లు చర్చించుకుంటున్నారు…