ఏపీ… బీ అలర్ట్ ఐసోలేషన్ నుంచి ఒక యువకుడు పరార్…

ఏపీ... బీ అలర్ట్ ఐసోలేషన్ నుంచి ఒక యువకుడు పరార్...

0
93

కరోనా వైరస్ ప్రతీ ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తోంది… ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు.. అయితే గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్న నేపధ్యంలో డాక్టర్లు అతన్ని ఐసోలేషన్ కు తరలించారు…

అయితే అక్కడ నుంచి ఆ యువకుడు పరార్ అయ్యాడు… ఈ విషయాన్ని వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు… ఇక కరోనా బాధితుడు పరార్ అయ్యాడనే వార్త ఈనోటీ ఆనోట చేరడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది… కాగా గుంటూ జిల్లాలో కొన్ని నగరాలను రెడ్ జోన్ గా ప్రకటించారు…

ఎవ్వరు బయటకు రాకూడదని, రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతాలకు ఎవ్వరు వెళ్లకూడదని తెలిపారు… కాగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ సంఖ్య 12కు చేరుకుందని హెల్త్ బులిటెన్ తెలిపింది…

విదేశాల నుంచి సుమారు 28,028 మంది వచ్చారని గుర్తించామని తెలిపారు.. 27,929 హోమ్ ఐసోలేషన్ లో ఉంచామని తెలిపారు… 385 మంది శాంపిల్స్ ను వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని 55 శాంపిల్స్ రిపోర్ట్ లు రావాల్సి ఉందని 12 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు…