మన దేశంలో పూర్తిగా లాక్ డౌన్ ఉంది, ఈ సమయంలో ఎవరూ బయకటు వెళ్లడానికి లేదు అయితే కచ్చితంగా కొందరు నిత్యవసర వస్తులువు అని బయటకు వస్తున్నారు.. అందులో ఎవరు నిజం చెబుతున్నారు అబద్దం చెబుతున్నారు అనేది తెలియడం లేదు.
అయితే ఇప్పుడు చాలా మంది ఈనెల లేదా వచ్చే మొదటి వారంలో డెలివరీ సమయం డేట్ తీసుకుని ఉంటారు గర్భిణీలు ,అలాంటి వారికి చాలా ఇబ్బంది. ఆటోలు కారులు బయటకు వెళ్లడానికి లేవు ..దీనిపై కేంద్రం పలు రాష్ట్రాలకు సూచన చేసింది. గర్భిణీలు ఉన్న వెహికల్స్ ఆపద్దు అని చెప్పింది.
వారికి ఆస్పత్రికి వెళ్లే వెసులుబాటు కల్పించాలి అని తెలిపింది అంతేకాదు ప్రభుత్వ- ప్రయివేట్ అంబులెన్సు వెళ్లినా వారికి వెసులు బాటు ఇవ్వాలని, గర్భిణీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి అని తెలిపింది, ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే చెప్పారు, కచ్చితంగా వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా వైద్యులు చూస్తారు అని తెలిపారు….100 లేదా 104 లేదా 108 కి సమాచారం ఇవ్వాలి అని సర్వీస్ పొందాలి అని తెలిపారు.