అసలే కరోనాతో అందరూ భయం భయంగా ఉన్నారు. ఈసమయంలో కచ్చితమైన సమాచారం చేరకపోతే పెను ప్రమాదమే అని చెప్పాలి, అయితే ఈ సమయంలో అతి జాగ్రత్త చాలా అవసరం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది వినాశనం అనే చెప్పాలి.
కరోనా వైరస్ నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. ఈ వ్యక్తి వైరస్ వ్యాప్తికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తద్వారా ప్రజల్లో భయాందోళనలు నెలకొల్పేందుకు యత్నించాడు. దీంతో వెంటనే అతని గురించి సోషల్ మీడియాలో తెలిసి అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ విషయాన్ని పోలీసులు కంపెనీకి తెలిపారు, వెంటనే కంపెనీ కూడా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది, ఇలాంటి అసత్య వార్తలు భయపెట్టే వార్తలు పెడితే ఇక జైలు శిక్ష తప్పదు అంటున్నారు పోలీసులు.