చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేసించింది.. దేశ మొత్తం మీద 810 కేసులు నమోదు కాగా కేరళలో ఒక్క రోజులోనే 39 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు… దేశంలో అత్యధికంగా నమోదు అవుతున్న రాష్ట్రం కేరళనే…
ఇది సామాజిక వ్యాప్తికి దారి తీసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమువుతోంది… రాష్ట్రంలో ఇప్పటికే 164 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు… వీరిలో 13 మంది కోలుకున్నట్లు తెలిపారు… కరోనా కేసుల్లో బాధితులు విదేశాల నుంచి వచ్చివారా లేక స్థానికులా అన్న విషయం తెలియాల్సి ఉంది…
మొత్తం నిర్ధారణ కేసుల్లో 34 కసర్ గడ్ లో నమోదైనవి కావడమే గమనార్హం… జిల్లాకు చెందిన ఒక వ్యక్తి గల్ఫ్ దేశాలనుంచి తిరిగి వచ్చిన తర్వాత మూడు జిల్లాలను తిరిగాడు పలువురిని కలవడంతో పాటు ఒక వివాహానికి కూడా హాజరు అయ్యాడట…