గ్యాస్ బుక్ చేస్తున్నారా ఈ విష‌యం త‌ప్ప‌క తెలుసుకోండి

గ్యాస్ బుక్ చేస్తున్నారా ఈ విష‌యం త‌ప్ప‌క తెలుసుకోండి

0
133

దేశం అంతా ఇప్పుడు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింది… పెద్ద ఎత్తున ఈ వైర‌స్తో అన్నీ రాష్ట్రాలు ఇబ్బంది ప‌డుతున్నాయి.. ఇక ఏప్రిల్ 14 వ‌ర‌కూ పూర్తిగా లాక్ డౌన్ విధించింది భార‌త ప్ర‌భుత్వం, ఇక ఈ వైర‌స్ రావ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కూ ఉద్యోగాలు కంపెనీలు ఏమీ లేవు .

అయితే ఇప్ప‌డు నిత్య అవ‌స‌ర వ‌స్తువులు కూడా చాలా వ‌రకూ ఇంట్లో తెచ్చుకుని స్టాక్ పెట్టుకుంటున్నారు ..బ‌య‌ట మార్కెట్లో స‌రుకు ఉంటుందా ఉండ‌దా అని భ‌య‌ప‌డుతున్నారు. బియ్యం స‌ర‌కులు పెద్ద ఎత్తున తెచ్చుకుంటున్నారు జనం.

ఈ స‌మ‌యంలో స్టాక్ ఉండ‌దు అనే భ‌యం వ‌ల్ల మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయి, ఇక తాజాగా గ్యాస్ గురించి కూడా చాలా మందికి ఆందోళ‌న మొద‌లైంది.మున్ముందు సిలిండర్లు దొరకవేమో అని, చాలా మంది ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. దాని వల్ల గ్యాస్ కొరత ఏర్పడింది.

అందరూ రెండేసి, మూడేసి బండలు బుక్ చేస్తుండటంతో… గ్యాస్ కంపెనీలకు షాక్ తగిలింది. మాములుగా హైదరాబాద్‌లో 2 లక్షల సిలిండర్లు బుక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏకంగా మూడున్నర లక్షలు బుక్ చేసుకున్నారు. అందుకే సెకండ్ బుకింగ్స్ అన్నీ నిలిపివేశాయి కంపెనీలు
ఒక గ్యాస్ బండ బుక్ చేస్తే, తర్వాత 14 రోజుల వరకూ ఆ వ్యక్తి మరో సిలిండర్ బుక్ చేసుకునే ఛాన్స్ లేదు.