ప్రతీ ఒక్కరు ఇలా చేస్తే చాలు కరోనాకు మెడిషన్ అవసరం లేదట..

ప్రతీ ఒక్కరు ఇలా చేస్తే చాలు కరోనాకు మెడిషన్ అవసరం లేదట..

0
80

ప్రజలంతా సామాజిక దూరం పాటించగలిగితే ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలతో అవసరమే పడదని తెలిపారు ఎంపీ విజయసాయి రెడ్డి… సిఎం జగన్ అధికారుల విజ్ఞాపనలు విని ప్రజలు లాక్ డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా సహనం ప్రదర్శించాలని అన్నారు. దేశంలోనే అతితక్కువ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా మన గౌరవాన్ని నిలబెట్టాలని అన్నారు..

నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారు గుంపులుగా కాకుండా దూరం పాటించాలని అన్నారు. సోషల్ డిస్టన్స్ ఒక్కటే మనకు శ్రీరామ రక్ష… తెలిసి కూడా చాలా మంది నిర్లక్ష్యంగా బయటకు వస్తున్నారని మండిపడ్డారు… కరోనా విషయంలో ఇది వెనక్కు తీసుకోలేని పొరపాటు అవుతుందని విజయసాయిరెడ్డి హెచ్చరించారు… హాస్పిటల్ గడప తొక్కే పరిస్థితి తెచ్చుకోవద్దని సలహా ఇచ్చారు..

ఈ ఆపత్కాలంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, గ్రామ, పట్టణాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునే పనుల్లో ఉన్న ఉద్యోగులందరినీ గౌరవించాలని తెలిపారు. వారి మనసు నొప్పించేలా వాదనకు దిగొద్దని అన్నారు… మనం ఇళ్లలో ఉంటే వారంతా కుటుంబాలను వదిలి ఎండలో, హాస్పిటళ్లలో ప్రాణాలు రక్షించే విధుల్లో ఉన్నారని తెలిపారు…

కరోనా మహమ్మారికి ప్రాణాలు తీయడం తప్ప దయాదాక్షిణ్యాలుండవని అన్నారు. ఉన్నత స్థాయి వ్యక్తులను వదిలిపెట్టడం లేదని అన్నారు. బ్రిటన్ ప్రధాని, ప్రిన్స్ చార్లెస్, కెనడా ప్రధాని సతీమణి ఇలా ఎందరో ప్రముఖులకు సోకిందని తెలిపారు. సామాజిక దూరం పాటించకుండా అందరితో కలవడం వల్లనే వారంతా ఈ మృత్యు వైరస్ కు లొంగారని తెలిపారు విజయసాయిరెడ్డి