మంచి మనసు ఉండాలి… సాయం చేసే గుణం ఉండాలని పెద్దలు అంటారు.. ధనవంతులు అందరూ సాయం చేస్తారు అని మనం నమ్మలేము.. కొందరు దానమూర్తులు దానం చేసి తమ మనసు చాటుకుంటారు, అయితే హీరోలు కూడా అంతే చాలా మంది ఏ ఆపద వచ్చినా కచ్చితంగా దేశానికి ఆ ప్రాంతానికి తాము ఉన్నాము అని ఆదుకుంటారు.
తాజాగా మన దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది.. ఈ సమయంలో ప్రధాని కూడా విరాళాలు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా పై పోరుకి ఆర్థిక సహాయం చేశారు.
పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు విరాళం ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు అక్షయ్ ట్వీట్ చేశారు…ఇది మన ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. అవసరమైతే దీని కోసం మనం ఏదైనా, ఎలాంటిదైనా చేయాలి. నా సొంత డబ్బు నుంచి రూ.25 కోట్లు పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తానని ప్రమాణం చేస్తున్నా అని తెలిపారు.