కరోనా ప్రభావంతో యావత్ ప్రపంచం వణికిపోతోంది, 198 దేశాలకు ఈ వైరస్ పాకేసింది.. పెద్ద ఎత్తున దీనికై విరాళాలు సేకరించి పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు.. ముఖ్యంగా ఇటలీ అమెరికా అత్యంత దారుణంగా కొట్టుమిట్టాడుతున్నాయి, భారత్ కూడా కాస్త డేంజర్ జోన్ లో ఉంది, అయితే ముందుగానే భారత్ తేరుకుని ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ విధించడంతో, కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అంటున్నారు.
ఈ సమయంలో మన దేశంలో కూడా విరాళాలు అందచేస్తున్నారు.. పీఎం సహయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు, ఇక సినిమా పరిశ్రమ నుంచి అక్షయ్ కుమార్ కూడా భారీ సాయం అందించారు.
ఈ ప్రభావం సినిమా పరిశ్రమపై చాలా ఎక్కువగా ఉంది, ఏ పనిలేక ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారు.. సినిమా షూటింగ్స్‌పై ఆధారపడుతున్న రోజువారీ సినీ కార్మికులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి… ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్‌కు తన వంతు సాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్.
సల్మాన్ కు సంబంధించిన బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్ ద్వారా 25 వేల మంది కార్మికులకు సంబంధించిన బాగోగులను చూసుకోనున్నారు. సదరు కార్మికుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు సల్మాన్.