వారందరికి కరోనా రావాలని కోరుకుంటున్నా… కేసీఆర్

వారందరికి కరోనా రావాలని కోరుకుంటున్నా... కేసీఆర్

0
79

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు… కొద్దికాలంగా సోషల్ మీడియాను వేధికగా చేసుకుని దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సోషల్ మీడియాలో దుర్మార్గమైన ప్రచారాలు చేసేవారికి అందరికన్నా ముందుగా కరోనా సోకుతుందని అన్నారు…

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ దాటికి వణికిపోతుంటే కొంతమంది చిల్లర ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు… వాళ్లు ఎంత దుర్మార్గమైన ప్రచారం చేస్తారో అంతకు వందరెట్లు శిక్ష అనుభవిస్తారని అన్నారు…

ప్రచారం చేసేవారిని మానసికంగా హింసించడం మంచిపద్దతి కాదని ఎవరైతే అపద్దపు ప్రచారం చేస్తున్నారో వారికి కరోనా రావాలని కేసీఆర్ అన్నారు… కాగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే… ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు…