మొత్తానికి అసత్య వార్తలతో సోషల్ మీడియా నిండిపోతోంది. ఈ సమయంలో వాస్తవాలు ఏమిటి అనేది ఎవరికి తెలియడం లేదు… ఇది ఇబ్బందికరంగా మారుతోంది. ఇక కేంద్రం విధించిన లాక్ డౌన్ అనేది మరోసారి ప్రకటిస్తారని ఇది ఏప్రిల్ 14 తో ముగిసిపోయేది కాదు అని అంటున్నారు కొందరు.
అయితే ఇలా సోషల్ మీడియాలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో వార్తలు వినిపిస్తున్నాయి, దీనిపై కేంద్రం కూడా సీరియస్ అయింది, ఇలాంటి అసత్య వార్తలు ప్రసారం చేసేవారిని వదలము అని తెలిపింది, అంతేకాదు ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అన్నారు.
కొన్ని రూమర్లు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 21 రోజుల లాక్ డౌన్ ముగిసిన తరువాత దాన్ని పొడిగిస్తారనడం నిరాధారం. కేంద్ర కార్యదర్శులు సైతం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు అని వివరణ ఇచ్చింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కూడా దీనిపై స్పందించారు.. ఇవన్నీ నిరాధారమైన కామెంట్లు అన్నారు, అసలు కేంద్రం అలాంటి ఆలోచన చేయడం లేదు అన్నారు.