మెగా కుటుంబం నుంచి ప్రతీ ఒక్కరూ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు, ఓ పక్క కేంద్రంలో ప్రధానికి సైతం మెగా కుటుంబం విరాళాలు ఇచ్చింది ఇటు ఏపీ తెలంగాణకు సాయం చేశారు, అలాగే సినిమా కార్మికులకి కూడా తమ వంతు సాయం చేస్తున్నారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెద్దమనిషిగా సినిమా కళాకారుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేశారు, ఈ సమయంలో టాలీవుడ్ అగ్రహీరోలు పెద్ద మనసుతో సాయం అందిస్తున్నారు. ఇక అగ్రహీరో అల్లు అర్జున్ సినీ కార్మికుల కోసం విరాళం ప్రకటించారు. . తనవంతుగా కార్మికుల కోసం రూ.20 లక్షలు అందించాలని నిర్ణయించారు.
ఈ విరాళాన్ని బన్నీ కరోనా క్రైసిస్ చారిటీ సీసీసీ కి అందించనున్నారు. ఈ విరాళంతో కలిపి బన్నీ కరోనా సహాయకచర్యల కోసం మొత్తం రూ.1.45 కోట్లు ఇచ్చినట్టయింది. ఆయన ఇంతకుముందు, ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు రూ.1.25 కోట్ల విరాళం ప్రకటించారు, దీంతో బన్నీ ఫ్యాన్స్ చాలా సంతోషంలో ఉన్నారు, ఇలా ఆపద వచ్చిన సమయంలో హీరోలు అందరూ ముందుకురావడంపై అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.