ఏపీలో కరోనాకు వాళ్లే డేంజరట జల్లెడ పడుతున్న ఏపీ సర్కార్….

ఏపీలో కరోనాకు వాళ్లే డేంజరట జల్లెడ పడుతున్న ఏపీ సర్కార్....

0
96

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది… దీన్ని నివారించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు అయినా కూడా రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి… ఈరోజు ఏపీలో ఒకే సారి 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి…

దీంతో ఏపీ మొత్తంమీద కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది… ఒకే సారి 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుంది… ఎక్కువగా మత ప్రార్థనల నిమిత్తం ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చిన వారికే కరోనా వైరస్ సోకుతుంది… అందుకే ప్రభుత్వం వారిపై ఫోకస్ చేస్తోంది…

మత ప్రార్థనల నిమితం ఏపీకి చెందిన 712 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు… వీరిలో అత్యధికంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు ఉన్నారు… ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత వీరు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు ఏఏ ప్రాంతాలు తిరిగారో వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు…