అందరూ కరోనాకి భయపడిపోతున్నారు ఇక పాలకులు సైతం ప్రజలకు దైర్యం చెబుతూ జాగ్రత్తలు చెబుతున్నారు.. పలు ఆంక్షలు పెడుతున్నారు, అయితే పాలకులు ఎవరైనా ఎలా ఉండాలి ప్రజలకు దైర్యం చెబుతూ జాగ్రత్తలు తెలియచేయాలి, కాని థాయ్ లాండ్ లో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది.
కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన థాయ్‌లాండ్‌లో రాజు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. స్వదేశాన్ని విడిచి విదేశాల్లో విలాసాలు చేస్తున్నాడు. కరోనాతో దేశం విలవిలలాడుతోంది కాని థాయ్‌లాండ్‌కు చెందిన 67 ఏళ్ల రాజు మహా వాజిరాలోంగ్కోర్న్.. జర్మనీలోని గర్మిస్చ్-పార్టెన్కిర్చెన్‌కు వెళ్లాడు. అక్కడ అల్పైన్ రిసార్ట్ టౌన్‌లోని సొన్నెన్‌బిచ్ల్ గ్రాండ్ హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు.
అక్కడే స్వయంగా ఐసోలేషన్ లో ఉన్నాడు,20 మంది అమ్మాయిలు, పనివాళ్లతో కలిసి హోటల్‌లో జల్సాలు చేస్తున్నాడు. దీంతో థాయ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, ఇక్కడ దేశంలో ఇలాంటి స్దితి ఉంటే ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నారు.