కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.. ఈ సమయంలో దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు, అయితే ఏప్రిల్ 14 వరకూ కచ్చితంగా అందరూ ఇంటిలో ఉండవలసిందే, అయితే కొందరు దీనిని పట్టించుకోకుండా చిన్న అవసరాలకు కూడా రోడ్లపైకి వస్తున్నారు..
దీంతో వారిపై పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు.జార్ఖండ్ రాంచీలో లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించిన ఓ యువకుడిపై పోలీసులు పైశాచికంగా వ్యవహరించారు. రాంచీలోని హింద్‌పిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిరు వ్యాపారి అయిన ఓ యువకుడు ఏదో పని మీద బయటకు వచ్చాడు.
ఇక పోలీసులు ఆ వ్యక్తిని చితక్కొట్టారట… అంతటితో ఆగకుండా ఆ యువకుడితో మూత్రం తాగించారు… ఆ యువకుడు తనను వదిలేస్తే ఇంటికి వెళ్లిపోతానని చెప్పాడు, అయినా ఆ పోలీసులు వినిపించుకోలేదు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో దీనిపై సర్కారు సీరియస్ అయింది, వెంటనే ఆ పోలీసులని అందరిని సస్పెండ్ చేశారు.