కరోనా వైరస్ దేశంలో అంతకంతకూ విజృంభిస్తోంది.. ముఖ్యంగా ఇప్పుడు దిల్లీలోని జరిగిన ఓ కార్యక్రమంతో ఇప్పుడు ఈ కరోనా వైరస్ కేసులు మరింత పెరిగాయి, అయితే దిల్లీలో మత ప్రార్ధనకు వెళ్లిన వారికి చాలా మందికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ కార్యక్రమం తబ్లిగి జమాత్ అనే సంస్థ నిర్వహించింది.
అసలు ఇంతకీ తబ్లిగ్ అంటే ఏమిటి అంటే .. అల్లా మాటల్ని బోధించటంగా చెబుతారు. జమాత్ అంటే సంస్థగా చెబుతారు. అంటే అల్లా మాటలను వీరు బోధిస్తారుఅని చెబుతారు, ఇక ప్రతీ ఏటా వీరు ప్రార్ధన కార్యక్రమం నిర్వహిస్తారు, ఇక దేశంలో భోపాల్ లో నిర్వహించే ప్రోగ్రాంకు లక్ష మంది వరకూ హాజరవుతారని చెబుతున్నారు.
సంవత్సరం ముందే ఈ కార్యక్రమం గురించి తెలియచేస్తారు, అందుకే దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రార్ధనలకు వస్తారు, అలాగే ఇక్కడకు పెద్ద సంఖ్యలో విదేశీయులు వచ్చారు.. 1927లొ హర్యానాలోని మేవాట్ లో ప్రారంభమైంది ఈ సంస్థ.