దేశంలో విమానాల రాక‌పోక‌ల‌పై కీల‌క నిర్ణ‌యం ఇక ఇదే ఫైన‌ల్

దేశంలో విమానాల రాక‌పోక‌ల‌పై కీల‌క నిర్ణ‌యం ఇక ఇదే ఫైన‌ల్

0
85

ఓప‌క్క క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కోర‌లు చాచుతోంది, ఈ స‌మ‌యంలో మ‌న దేశంలో లాక్ డౌన్ విధించారు.. దీని వ‌ల్ల మ‌న‌దేశంలో భారీ న‌ష్టం జ‌ర‌గ‌లేదు అనే చెప్పాలి.. లేక‌పోతే మ‌న‌దేశంలో మ‌రింత దారుణం జ‌రిగి ఉండేది. నిజంగా పీఎం తీసుకున్న నిర్ణ‌యం చాలా మంచిది అయింది.

అయితే ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో ఎక్క‌డ వారు అక్క‌డ ఉండ‌టం వ‌ల్ల కొన్ని కేసులు త‌గ్గుతున్నాయి, కాస్త స‌ర్కారుకి ఇబ్బంది అయినా ఇలా అమ‌లు చేస్తున్నారు, అయితే ఏప్రిల్ 14 త‌ర్వాత లాక్ డౌన్ ఉండే అవ‌కాశాలు ఉండ‌వు అని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే రైలు బ‌స్సులు కూడా స్టేట్స్ ప‌రిధిలో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తాయి అంటున్నారు, త‌ర్వాత ఇత‌ర స్టేట్స్ కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది అంటున్నారు, అయితే విమానాల విషయంలో కూడా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియ‌ని ప‌రిస్దితి, కాని పరిస్థితులను అనుసరించి, ఏ దేశాల నుంచి వస్తున్నాయో తెలుసుకొని లాక్‌డౌన్‌ తర్వాత విమానాలకు అనుమతిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు.