ఈ పండు తింటే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు

ఈ పండు తింటే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు

0
102

మ‌న భార‌త్ లో కివీ పండ్ల‌కు మంచి మార్కెట్ ఉంది… ఖ‌రీదు ఉన్నా చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు..ఈ పండును చాలా మంది వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండులో నిమ్మ, ఆరెంజ్ తో పోలిస్తే సి విటమిన్ అధికంగా ఉంటుంది. అందుకే ఒంటికి చాలా మంచిది అని చెబుతారు.

మన దేశంలో ఈ పండ్లు పండవు. కివి పండు చూడటానికి చిన్నగా కనిపించినా ఈ పండ్ల వల్ల అనేక ప్రయోజనాలు చేకూరటంతో పాటు పండు ఎంతో రుచిగా ఉంటుంది. ఇక వీటిని సాధార‌ణంగా తీసుకున్నా మిల్క్ షేక్ తో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది.

అంతేకాదు ఈ పండు గుజ్జును ఫేస్ మాస్క్ మాదిరిగా ఉపయోగించవచ్చు. ఈ పండు గుజ్జును షాంపూలా ఉపయోగిస్తే జుట్టు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. రోజుకి మీరు ఒక కివీ తీసుకున్నా మీకు గొంతు శ్వాస సంబంధ వ్యాధులు త‌గ్గుతాయి. ఇది తింటే జీర్ణ‌స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వు.