కరోనా విలయంతో దేశంలో ఆర్ధికంగా చాలా ఇబ్బంది వచ్చింది.. తినడానికి తిండి లేని కూలీలకు పేదలకు అభాగ్యులకి చాలా మంది సాయం చేస్తున్నారు, ఇక బాలీవుడ్ నటులు కూడా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అక్షయ్ సల్మాన్ కూడా ఇప్పటికే సాయం ప్రకటించారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఒకట్రెండు మార్గాల ద్వారా కరోనా సాయం చేస్తున్నారు. పేదవారికి నిత్యావర సరుకులని అందించేందుకు రెడీ అయ్యారు. షారూఖ్ ఆధ్వర్యంలోని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మీర్ ఫాండేషన్, రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ పలు సంస్థలు దాతృత్వ కార్యక్రమాలు చేపట్టనున్నాయి. వీరందరూ పేదలకు సాయం చేయనున్నారు.
వీరితో కలిసి ఈనెల 5500 కుటుంబాలకి భోజనం అందిస్తున్నాయి. రోటీ ఫౌండేషన్ తో కలిసి మూడు లక్షల భోజనం కిట్స్ కూడా అందిస్తున్నారు. ఇది 10 వేల మందికి నెలరోజుల పాటు సరఫరా చేయనున్నారు. మీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు 2500 మంది కూలీలకి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.
అంతేకాకుండా పీఎం సీఎం సహయనిధికి కొంత సహయం అందించనున్నారు.