అత్యంత దారుణంగా అమెరికాలో పరిస్దితి మారిందట.. కరోనా వైరస్ తో ఇప్పుడు ఇంత దారుణమైన స్దితికి అమెరికా చేరిపోయింది, ఏకంగా ఆరువేల మరణాలు సంభవించాయి రెండు లక్షల మందికి పాజిటీవ్ అని తేలింది.
దీంతొ అగ్రరాజ్యం వణికిపోతోంది, ఈ సమయంలో అక్కడ మరణాల సంఖ్య మరింత పెరుగుతోంది అంటున్నారు.. చాలా వరకూ పలు డిసీజెన్ ఉన్న వారికి ఈ వ్యాధి రావడంతో మరింత వారికి చికిత్స అందించినా కోలుకోలేరు అంటున్నారు.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.45 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 6059గా నమోదైంది. ఇక్కడ మృతదేహాలను ఉంచేందుకు లక్ష బాడీ బ్యాగులు కావాలంటూ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ఫెమా అమెరికా సైనిక విభాగాన్ని కోరడం తీవ్ర కలకలం రేపుతోంది. పెంటగాన్ వర్గాలు కూడా దీన్ని ధ్రువీకరించాయి. దీంతో అమెరికాలో ఇంతటి దారుణమైన స్దితి ఉందా అని అందరూ భయపడుతున్నారు.