పవన్ కు బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ ……

పవన్ కు బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ అట..

0
95

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే… వరుసగా ఆయన మూడు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు… అందులో ఒకటి వకీల్ సాబ్ ఈ చిత్రం తుది దశకు చేరుకుంది కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది… కరోనా ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ను యాధావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ లో గుసగుసలు…

ఇక ఈ చిత్రం విడుదల తర్వాత దర్శకుడు క్రిష్ తో పవన్ సినిమా తీయనున్నాడు… ఈ సినిమా 1870 నాటి పరిస్థితులకు అనుగునంగా తీయబోతున్నట్లు సమాచారం… అంతే కాదు ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది…

పవన్ కు హీరోయిన్ గా బాలీవుడ్ అందాల సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో ఒక సాంగ్ లో నటించింది…