రాజీవ్ క‌న‌కాల సోద‌రి మ‌ర‌ణం ఆమెకు ఏమైందంటే?

రాజీవ్ క‌న‌కాల సోద‌రి మ‌ర‌ణం ఆమెకు ఏమైందంటే?

0
194

ఇప్ప‌టికే దేశంలో క‌రోనాతో అంద‌రూ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతున్నారు, అయితే ఈ దారుణ‌మైన స్దితిలో సినిమా ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాద ఘ‌ట‌న జ‌రిగింది. ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల ఇంట విషాదం నెలకొంది.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈవార్త టాలీవుడ్ ఇండ‌స్ట్రీని షేక్ కి గురిచేసింది. ఆమె కొంత కాలంగా క్యాన్స‌ర్ వ్యాదితో బాధ‌ప‌డుతున్నారు, ఈ స‌మ‌యంలో ఆమె చికిత్స కూడా కొంత‌కాలంగా తీసుకుంటున్నారు, కాని ప‌రిస్దితి విష‌మించ‌డంతో ఆమె మ‌ర‌ణించారు.

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల రీత్యా శ్రీలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఎవరూ రావొద్దని ఆమె కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆమె రాజీవ్ క‌న‌కాల‌కు సోద‌రి, యాంక‌ర్ సుమ‌కు ఆడ‌ప‌డుచు, ఇక ద‌ర్శ‌కుడు న‌టుడు దేవ‌దాస్ క‌న‌కాల కూతురు శ్రీల‌క్ష్మి… ఆమె భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు, ఆయ‌న అంద‌రికి తెలిసిన ప‌ర్సెన్, ఇక వారికి ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.