విజయసాయిరెడ్డి భారీ హెచ్చరికలు…

విజయసాయిరెడ్డి భారీ హెచ్చరికలు...

0
105

ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉంటే తప్ప కరోనాను నియంత్రించలేమని అన్నారు… మహారాష్ట్రలో కరోనా మూడో స్టేజికి వెళ్లినట్టు అక్కడ ప్రభుత్వం ఆందోళన చెందుతోందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరినీ కలవకున్నా వ్యాధి సోకినట్టు గుర్తించారని అన్నారు. మనకు ఆలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు

చైనా నుంచి ప్రపంచమంతా వ్యాపించిందని కరోనా వైరస్ కు కులాలు, మతాలు లేవని ఎవరికైనా సోకవచ్చని తెలిపారు తమ ప్రాణం పోవాలని ఎవరూ అనుకోరని కొద్దిమందిని అనుమానించి దోషులుగా చూడొద్దని అన్నారు.. అందరం సంఘటితంగా నిలబడి ఎదుర్కోవాల్సిన సమయమిదని తెలిపారు.. ఈ మహమ్మారిని తరిమేసే వరకు పోరాడాల్సిందేనని అన్నారు…

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటోందని విజయసాయిరెడ్డి అన్నారు… వ్యాధి నియంత్రణలో అధికార యంత్రాంగం వెన్నుతడుతూ సిఎం జగన్ ఎక్కడా చిన్న లోపం తలెత్తకుండా చూసుకుంటున్నారు. పేదలకు వెయ్యి చొప్పున వలంటీర్లు పంపిణీ చేస్తే ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోందని మండిపడ్డారు.