వన్ స్టోర్ ఆల్ షాపింగ్ ఇలా చెప్పాలి అంటే పేద మధ్య తరగతి వారికి డీ మార్డ్ ఓ మంచి స్టోర్ అనే చెప్పాలి, చాలా మంది అక్కడే షాపింగ్ చేసుకుంటారు.. నిత్య అవసరాల నుంచి బట్టల వరకూ అన్నీ ఇక్కడే కొంటారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు భేష్ అంటున్నారు జనం.
ఇప్పటికే చాలా మంది పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు ప్రధానమంత్రికి, అయితే తాజాగా
ప్రముఖ షాపింగ్మాల్ డీమార్ట్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.10 కోట్లు సహాయం ప్రకటించింది.
మొత్తం 155 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంస్థ అధినేత రాధాకిషన్ దమానీ ఇందులో రూ.వంద కోట్లు పీఎం కేర్స్కు కేటాయించారు. తాజాగా 11 రాష్ట్రాలకు 55 కోట్ల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఇందులో తెలంగాణకు రూ.5 కోట్లు, ఏపీకి రూ.5 కోట్లు ఇవ్వనున్నారు, ఇక సౌత్ ఇండియాలో డీ మార్ట్ చాలా పెద్ద వ్యాపార సంస్ద, ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పదుల సంఖ్యలో స్టోర్స్ ఉన్న సంగతి తెలిసిందే.