కొందరు మహిళలు చేసే పనులు తెలిస్తే వారిని ఏమనాలో అర్ధం కాదు ..మన దేశంలో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోతున్నారు, అతనికి బ్యాంకులో ఉద్యోగం నెలకి 50 వేల జీతం.. ఇంతకంటే నా కూతురికి ఏం కావాలి అని ఆ తండ్రి ఆశపడి అబ్బాయికిచ్చి పెళ్లి చేశాడు. రెండు ఎకరాల పొలం ఉంటే ఓ ఎకరం ఆమెకి కట్నం గా ఇచ్చాడు.
ఇలా బాగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తర్వాత… భర్త నిత్యం బ్యాంకులో లేట్ గా రావడంతో ఆమె అతనిపై కాస్త కోపగించుకునేది.. ఉదయం 9 రాత్రి 8 ఇంత సేపా అని ఆమె విసుక్కునేది, ఈ సమయంలో అతనికి వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది.
ఈ విషయం అత్తమామలకు తెలిసింది.. వీరి సరసాలు చూసి కొడుక్కి ఈ విషయం చెప్పారు.., బాబాయ్ కొడుకు కావడంతో ముందు మందలించాడు, అయినా భర్తకు తెలిసింది కదా అని ఇంకా బరితెగించింది, దీంతో వారి పద్దతిలో మార్పు రాలేదు, చివరకు నీకు విడాకులు ఇస్తాను అని అన్నాడు, అంతే ఆమె వెంటనే పుట్టింటికి వెళ్లిపోతున్నా అని వెళ్లిపోయింది, చివరకు ఆమె పుట్టింటికి వెళ్లకుండా ఆ మరిదిని తీసుకుని వెళ్లి రెండో వివాహం చేసుకుంది, దీంతో గ్రామస్తులు అవాక్కయ్యారు.