వారందరికి ధన్యవాదాలు తెలిపిన విజయసాయిరెడ్డి…

వారందరికి ధన్యవాదాలు తెలిపిన విజయసాయిరెడ్డి...

0
97

లాక్ డౌన్ ఆపద సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు, అన్నదానాలు చేస్తూ గొప్ప మనసు కనబరుస్తున్న వారందరికి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి… చిన్నపిల్లలు, పెద్దగా స్థోమతలేనివారూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపిస్తున్నారని సాటి పౌరుల పట్ల వారికున్న అభిమానం వెలకట్టలేనిదని అన్నారు.

అలాగే ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన పేదలకు ప్రభుత్వం వెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని కన్నా, సిపిఐ రామకృష్ణలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసారు. వీళ్ల యజమానేమో ఐదు వేలివ్వమని రంకెలేస్తున్నారు. రాజకీయాలు చేయడానికి ఇంత కంటే అనువైన సమయం దొరకలేదా మీకు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు..

ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడం ఎలాగో సీఎం జగన్ ని చూసి నేర్చుకో చంద్రబాబు అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కోవిడ్ వైద్యాన్ని తీసుకొచ్చారని తెలిపారు. రోగులకు 16 వేల నుంచి 2.16 లక్షల వరకు ఉచిత చికిత్స అందుతుందని తెలిపారు. నన్ను సంప్రదించడం లేదని శోకాలు పెడుతున్నావు. ఇలాంటి ఆలోచన నీకు తట్టలేదెందుకో అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి