కరోనా వైరస్ విజృంభనతో దేశంలో పెద్ద ఎత్తున ఆర్దిక సంక్షోభం ఉంది, అందరూ ఇంటికి పరిమితం అయ్యారు, నిత్య అవసర వస్తువులు మినహ, వేటికి బయటకు రాకూడదు అని తెలిపింది కేంద్రం. మొత్తం 21 రోజుల లాక్ డౌన్ తో కచ్చితంగా అందరూ ఇంటికి పరిమితం అయ్యారు.
ఈ సమయంలో వ్యాపారాలు లేక చాలా మంది నష్టాల ఊబిలో ఉన్నారు, ఇక కంపెనీ షేర్లు కూడా పతనం అయ్యాయి. కాని ఈ సమయంలో కూడా లాభపడ్డ బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే ఠక్కున వినిపించే పేరు రాధాకిషన్ దమానీ.
ఆయన అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ డీ మార్ట్ సూపర్ మార్కెట్ల అధినేత. ఓపక్క కరోనా భయంతో అందరూ దేశంలో డీ మార్డ్ వైపు పరుగులు పెట్టారు… ఉన్నా సరుకు తెచ్చుకుని చాలా మంది ఇంటికి పరిమితం అయ్యారు, ఈ సమయంలో డీ మార్ట్ సేల్స్ కూడా భారీగా పెరిగాయి. ఇక ఆ కంపెనీ షేర్లు కూడా భారీగా పెరిగాయట, మన దేశంలో 12 మంది అపరకుబేరుల్లో లాభాలు గడించింది ఆయన ఒక్కరే అట.