భర్త ఆఫీసు పని మీద వేరే చోటుకి వెళ్లాడు, అయితే అక్కడ నుంచి లాక్ డౌన్ దేశంలో ప్రకటించడంతో కంపెనీ కారులో అక్కడ నుంచి తన స్వస్ధలం చేరుకున్నాడు, ఈ సమయంలో లాక్ డౌన్ ఉంటుంది అని భార్యకి తెలియదు, భర్త లేకపోవడంతో ఇంటికి తాళం వేసి ఆమె కూడా అదే రోజు ప్రియుడితో మూడు రోజులు హిమాచల్ వెళ్లింది.
ఇలా టూర్ కు చెక్కేసింది, కాని భర్త తిరిగి వచ్చాడు, అయితే ఆమె అక్కడ ప్రియుడితో లాక్ డౌన్ లో చిక్కుకుపోయింది, ఇక భర్త ఇంటికి వచ్చేసరికి భార్య ఇక్కడ లేదు, ముందు మాత్రం తాను ఫ్రెండ్ ఇంటికి వచ్చాను అని కేరళ వచ్చాను అని అబద్దం చెప్పింది, దీంతో అనుమానంతో ఆమె ఫోన్ ట్రేస్ చేస్తే..
ఆమె హిమాచల్ లో ఉన్నట్లు తేలింది .. ఆమె పై అనుమానం ఉన్న భర్త ప్రియుడి నెంబర్ కూడా ట్రేస్ చేశాడు, ప్రియుడు కూడా అక్కడే ఉన్నాడు అని తేలడంతో అతను షాక్ అయ్యాడు, గతంలో ఆమె ఇలా చీట్ చేసినా అతను ఏలుకున్నాడట, ఇక ఆమె ముఖం చూసేది లేదు అని ఆమె తల్లిదండ్రులకి చెప్పాడట.