ఆమెకు తెలుగులో చేసిన సినిమాలతో పెద్ద అవకాశాలు రాలేదు, దీంతో ఆమె కోలీవుడ్ కు వెళ్లింది..అక్కడ వరుసగా సినిమాలు చేసే అవకాశం వచ్చింది.. మంచి హిట్లు పడ్డాయి.. ఈ సమయంలో ఓ దర్శకుడి సోదరుడితో ఆమె ప్రేమలో పడింది, వారిద్దరూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నారు, అతను కూడా ఓ హీరోగా అక్కడ పేరు తెచ్చుకున్న వ్యక్తే.
ఇలా పీకల్లోతు ప్రేమలో ఉండగా వీరి గురించి మీడియాలో వార్తలు వచ్చాయి, అయితే ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నారు అని తెలుస్తోంది, అయితే వినడానికి బాగానే ఉంది కాని , ఇప్పటికే ఆ వ్యక్తికి వివాహం అయిందట, అయితే అతను తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి .
ఈ హీరోయిన్ ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు, కాని హీరోయిన్ కుటుంబం మాత్రం వద్దు అంటున్నారట, అయితే ఆమె మాత్రం ఆ హీరోని వివాహం చేసుకుంటాను అని చెప్పిందట, చివరకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయట. కరోనా తీవ్రత తగ్గాక ఇద్దరూ వివాహం చేసుకుంటారని టాక్ నడుస్తోంది.