మాస్క్ లేకుండా వ‌స్తే ఇక అంతే ఏపీలో కీల‌క నిర్ణ‌యం

మాస్క్ లేకుండా వ‌స్తే ఇక అంతే ఏపీలో కీల‌క నిర్ణ‌యం

0
99

ఈ వైర‌స్ వ్యాప్తి అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. ఈ స‌మ‌యంలో పాజిటీవ్ కేసులు కూడా తెలుగు స్టేట్స్ లో పెరుగుతున్నాయి, అయితే ఇక దిల్లీ ప్రార్ధ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారి ద్వారా ఇంకా ఎవ‌రికి అయినా సోకిందా అనేదానిలో అంద‌రికి టెస్టులు చేస్తున్నారు.. దీంతో కాస్త పాజిటీవ్ కేసుల సంఖ్య త‌గ్గుతోంది.

కాని కొన్ని జిల్లాల్లో మాత్రం అంత‌కంత‌కు పెరుగుతున్నాయి, అందుకే లాక్ డౌన్ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాలి అని చూస్తున్నారు అధికారులు.. ఈ స‌మ‌యంలో గుంటూరులో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో జిల్లాలో లాక్‌డౌన్‌ మరింత స్ట్రిక్ట్ గా అమలు చెయ్యాలని అధికారులు భావిస్తున్నారు.

వైర‌స్ కట్టడి చర్యల్లో భాగంగా.. నిబంధనలు మరింత కఠినతరం చెయ్యాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. ఎవ‌రైనా బ‌య‌ట‌కు వ‌స్తే క‌చ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, లేక‌పోతే క‌చ్చితంగా వెయ్యి రూపాయ‌లు ఫైన్ క‌ట్టాల్సిందే…ఉద్యోగులు కూడా ఉద‌యం 10 నుంచి సాయంత్ర 5 వ‌ర‌కూ రావాలి అని తెలిపారు, ఇక రోడ్ల‌పై వాహ‌నాలు తిరిగితే ఊరుకునేది లేదు అన్నారు ఆయ‌న‌.