లాక్ డౌన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్దితి, అయితే ఇప్పుడు ప్రజా రవాణా కూడా ఉంటుందా ఉండదా అనేది ప్రయాణికులకి పెద్ద ప్రశ్నగా మారింది, చాలా వరకూ ఇంకా మరో పదిహేను రోజులు లాక్ డౌన్ పొడిగిస్తారు అని భావిస్తున్నారు.
అయితే ప్రయాణికులు ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచి రైలు బస్సు విమాన ప్రయాణాలకు సిద్దం అయి టికెట్స్ బుక్ చేసుకున్నారు, కాని ఆ టికెట్స్ క్యాన్సిల్ అవుతాయి అంటున్నారు., ఇక కచ్చితంగా లాక్ డౌన్ పెంచే ఆస్కారం ఉంది అంటున్నారు, అయితే తాజాగా రైల్వే శాఖ ఓ క్లారిటీ ఇచ్చింది.
మాస్క్ పెట్టుకోని రైల్వే ప్రయాణాలు చేయాలి అని ? అలాగే హెల్త్ సర్టిఫికెట్ తెస్తేనే ప్రయాణం చేయాలి అని బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై స్పందించారు, తాము అలాంటి నియమాలు పెట్టలేదని.. పెడితే కచ్చితంగా ప్రజలకు తెలియచేస్తాము అని రైల్వేశాఖ తెలిపింది.