బ్రేకింగ్ …టెన్షన్ పెడుతున్న ఆ ప్రాంతం ఎందుకో తెలుసా

బ్రేకింగ్ ...టెన్షన్ పెడుతున్న ఆ ప్రాంతం ఎందుకో తెలుసా

0
87

దేశంలో అందరూ ఇప్పుడు ఓ ప్రాంతం గురించి చర్చించుకుంటున్నారు.. అదే ముంబైలోని ధారావి, అక్కడ పేదలు చాలా మంది ఉంటారు, ఆ మురికివాడలో ఆదివారం నాటికి కరోనా కేసులు 43కు చేరుకున్నాయి. ఇక్కడ జనాభా చాలా మంది ఉంటారు ,ఇరుకు సందులు ఇరుకు ఇళ్ల మధ్య జీవనం ఉంటుంది ..దీంతో ఇక్కడ కరోనా వ్యాప్తి పెరిగితే పెను ప్రమాదం అని సర్కారు ఆలోచిస్తోంది.

ఒక్కరోజులోనే 15 కొత్త కేసులు రావడమే ఇందుకు కారణం. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందింది ధారావి, ఇప్పటికే ధారావి మృతుల సంఖ్య 4కు చేరింది. ఇక మరో విషయం ఏమిటి అంటే సుమారు 8 లక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేసేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు.

ఇక్కడ చదరపు కిలోమీటర్కు 66 వేల మంది నివసిస్తారు…అలాంటి ఈ మురికివాడలో లాక్డౌన్ అమలు చేయడం అంత సులభం ఏమీ కాదు… పాపం నిత్యం వీరికి అనేక సొసైటీలు నాయకులు సర్కారు కూడా ఆహరం ఇస్తోంది.. వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఏ ఇబ్బంది లేకుండా సర్కారు భోజనం ఆహర సరుకులు ఇస్తున్నారు, ఇప్పటికైనా ఇలాంటి ప్రాంతాలలో వారికి సరైన పక్కా గృహాలు నిర్మించాలని కరోనా తర్వాత దీనిపై ఆలోచన చేయాలి అని నెటిజన్లు కోరుతున్నారు.